శ్రీరామచంద్రుడు మంచి భర్త కాదంటున్న రాంజెఠ్మలానీ!!

శుక్రవారం, 9 నవంబరు 2012 (09:27 IST)
File
FILE
ఇతిహాస రామాయణంలోని శ్రీరామచంద్రుడు (శ్రీరాముడు) మంచి భర్త కాదని భారతీయ జనతా పార్టీ నేత, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ అభిప్రాయపడ్డారు. పరులమాట విని సీతాదేవిని అడవులకు పంపిన ఆయనను తాను సమర్థించబోనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

గురువారం ఢిల్లీలో 'మెన్ - ఉమెన్ రిలేషన్‌షిప్' అనే పుస్తకావిష్కరణ సభలో జెఠ్మలానీ మాట్లాడుతూ.. పరుల నిందలు విని, స్పష్టమైన కారణం లేకుండా సీతను వనవాసానికి శ్రీరాముడు పంపారని, అందుకే ఆయన మంచి భర్తకాదన్నది తన అభిప్రాయమన్నారు.

ఎవరో కొందరు మత్స్యకారులు చెప్పినంత మాత్రాన ఆయన తన భార్య సీతను వనవాసానికి పంపడమేనా? అని ప్రశ్నించారు. లక్ష్మణుడు కూడా అంత మంచొడేంకాదంటూ జఠ్మలానీ చివర్లో వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి