పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన కరుడుగట్టిన 12 మంది బబ్బర్ ఖల్సా ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో భారత్‌లోకి చొరబడినట్లు అతడు వెల్లడించాడు. వీరు ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారంతో పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.