2003 ముంబై పేలుళ్ళపై నేడు తుది తీర్పు

గురువారం, 6 ఆగస్టు 2009 (12:13 IST)
గత 2003 సంవత్సరంలో జరిగిన ముంబై పేలుళ్ళ కేసులో ముంబై ప్రత్యేక కోర్టు గురువారం తుది తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు తుది తీర్పు ఇటీవల వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న అష్రత్, షఫీక్ అన్సారీ (32), మహ్మద్ హనీఫ్ సయీద్ (46), ఈయన భార్య ఫెమీదా సయీద్ (43)లను ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చిన విషయం తెల్సిందే.

ఈ కేసులో హాజరైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్జ్వల్ నిఖమ్ వాదిస్తూ..దోషులుగా తేలిన ముగ్గురికి కఠిన శిక్ష విధించాలని కోరారు. ఈ దోషులు పన్నిన కుట్రకు 54 మంది మృత్యువాత పడగా, మరో 244 మంది గాయపడ్డారని, ఇలాంటి తీవ్రమైన నేరం చేసిన దోషులకు గరిష్ట శిక్ష విధించాలని నిఖమ్ కోరారు.

2003 సంవత్సరం ఆగస్టు 25వ తేదీన ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, అత్యంత రద్దీగా ఉండే దక్షిణ ముంబైలోని జావేరి బజార్‌లలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల వెనుక లష్కర్ తోయిబా తీవ్రవాద హస్తం ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.

వెబ్దునియా పై చదవండి