లడాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు సైనికుల మృతి

గురువారం, 30 జూన్ 2022 (17:44 IST)
లడాఖ్‌లో  ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు మృతి చెందారు. తుర్తుక్ సెక్టార్‌లో ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు షయొక్ నదిలో పడిపోవడంతో సైన్యం తెలిపింది.  
 
ప‌ర్తాపూర్ క్యాంప్ నుంచి 26 మంది జ‌వాన్లు వాహ‌నంలో బ‌య‌ల్దేరారు. షయొక్ న‌ది ద‌గ్గ‌ర వాహ‌నం స్కిడ్ అయి న‌దిలో ప‌డిపోయింది. 
 
ఏడుగురు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. మిగ‌తా జ‌వాన్లు గాయాల పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ జ‌వాన్ల‌ను ఆర్మీ ఫీల్డ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌ని ఆర్మీ పేర్కొంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు