బాయ్ ఫ్రెండ్సే రేపిస్టులు... ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ వెల్లడి

శుక్రవారం, 28 నవంబరు 2014 (10:27 IST)
అధిక సంఖ్యలలో అమ్మాయిలు అత్యాచారాలకు గురైయ్యేది బాయ్‌ఫ్రెండ్స్ చేతిలోనేనని ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ... ముంబై మహానగరంలో బాయ్ఫ్రెండ్స్ చేతిలో అత్యాచారానికి గురవుతున్న యువతుల సంఖ్య నానాటికి అధికమవుతుందన్నారు. 
 
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నెల వరకు 542 అత్యాచార ఘటనలు చోటు చేసుకోగా, వాటిలో 389 కేసులు బాయ్ఫ్రెండ్ చేతిలోనే యువతులు అత్యాచారానికి గురైయ్యారని చెప్పారు. బాయ్ఫ్రెండ్లు చెప్పే మాయ మాటలను యువతలు వెంటనే నమ్మడం వల్ల ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని రాకేశ్ మారియా విశ్లేషించారు. 
 
కాగా మరో ఆరు శాతం మంది యువతులు ఆగంతకుల చేతిలో అత్యాచారానికి గురైయ్యారని తెలిపారు. మిగిలిన యువతులు మాత్రం బంధువులు లేక పరిచయస్థుల చేతిలో అత్యాచారానికి గురైనవారని ఆయన చెప్పారు. అయితే మొత్తం 542 అత్యాచార కేసుల్లో ఇప్పటివరకు 477 కేసులను ఛేదించినట్లు  రాకేశ్ మారియా వివరించారు.

వెబ్దునియా పై చదవండి