ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ మరోసారి చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో తొమ్మిది మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఓ మహిళ కూడా ఉందని సమాచారం. పలువురు గాయపడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మణిపూర్ రాజధాని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖమెన్‌లక్ ప్రాంతంలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఉగ్రవాదులు, గ్రామ వాలంటీర్ల మధ్య సోమవారం రాత్రి వరకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటన కారణంగా తొమ్మిది మంది మృతి చెందారని, ఐదుగురు గాయపడ్డారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ధ్రువీకరణ మాత్రం రాలేదు.