విజయకాంత్ బొమ్మకు నిప్పు... అన్నాడీఎంకె కార్యకర్తల పంచెలకు నిప్పు

బుధవారం, 30 డిశెంబరు 2015 (20:20 IST)
థూ అంటూ మొన్న జర్నలిస్టులనుద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో విజయకాంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు అన్నాడీఎంకె కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున గుమిగూడారు. తమిళనాడు సీఎం జయలలితపైన, జర్నలిస్టులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనటుడు విజయకాంత్ తీరును నిరసిస్తూ, అన్నాడీఎంకే కార్యకర్తలు చేపట్టిన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో స్వల్ప ప్రమాదం సంభవించింది.
 
విజయకాంత్ దిష్టిబొమ్మకు నిప్పటించిన వేళ, మంటలు ఎగసిపడి ఇద్దరు ఆందోళనకారుల పంచెలకు నిప్పంటుకుంది. ఈ ఘటనలో ఓ అన్నాడీఎంకే కార్యకర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం నాడు విల్లుపురంలో జరిగింది. పంచెకు నిప్పంటుకోవడంతో, వెంటనే ఆ కార్యకర్త దాన్ని వదిలి పరుగు లఘించుకున్నాడు. ఈ ప్రమాదంలో అతనికి స్వల్ప గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. 
 
ఇకపోతే విజయ్ కాంత్‌ను అరెస్ట్ చేసేందుతు తమిళనాడులోని జయలలిత సర్కారు ప్రయత్నిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టు మధురై బెంచ్‌లో విజయ్ కాంత్ పిటిషన్లు దాఖలు చేశారు.
 

వెబ్దునియా పై చదవండి