రోజంతా ఒబామా ఒక్క సూటే... మోడీ నాలుగు: ఓవైసీ పరిహాసం..!

మంగళవారం, 3 మార్చి 2015 (18:08 IST)
అమెరికా అధ్యక్షుడే రోజంతా ఒకే ఒక్క సూట్‌ ధరిస్తే, భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం రోజుకు నాలుగు సూట్లు ఎడాపెడా మార్చేశారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా విమర్శించారు. జనవరిలో భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆకట్టుకునేందుకు గణతంత్ర దినోత్సవం రోజున మోడీ తన దుస్తులు మార్చారని వ్యాఖ్యానించారు. 
 
ఒక్కరోజులోనే ప్రధాని నాలుగుసార్లు దుస్తులు మార్చారు. ఏకంగా రూ.10 లక్షల సూట్ ధరించారు. కానీ అదే రోజు ఒబామా కేవలం ఒక్క సూట్ తోనే ఉన్నారు అని అక్బరుద్దీన్ తెలిపారు. అధికారంలోకి వచ్చాక మోడీకీ ఎలా పాలించాలో తెలియదన్నారు. తన జపాన్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి షింజో అబేకు భగవద్గీత కాపీ ఒకటి మోడీ ఇచ్చారన్న అక్బరుద్దీన్, ఆయనే గనుక లౌకికవాది అయిదే భారత రాజ్యాంగ పుస్తకం ఒకటి ఇచ్చి ఉండాల్సిందని అక్బరుద్దీన్ అన్నారు.

వెబ్దునియా పై చదవండి