అమిత్ షాకు చెక్ పెట్టేందుకే.. అమర్ సింగ్-ములాయం ఏకమవుతున్నారా?

మంగళవారం, 19 ఆగస్టు 2014 (12:57 IST)
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో అమిత్ సింగ్ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ములాయం, అమర్ సింగ్‌లు ఏకమవ్వడమే కాకుండా.. మయావతిని కూడా తమ కూటమిలోకి చేరాలని పిలుపునిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం అన్ని ప్రధాన పార్టీలను చావుదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త మలుపులు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండే సంబంధాలను పక్కన పెట్టి ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్‌లు ఏకమయ్యేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. 
 
మంగళవారం ఉదయం సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లక్నోలోని నివాసానికి అమర్ సింగ్ రావడం చర్చనీయాంశమైంది. గతంలో సమాజ్ వాదీ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన అమర్ సింగ్‌ను మళ్లీ పార్టీలోకి రప్పించి పటిష్టం చేసే విధంగా ములాయం వ్యూహాలు పన్నుతున్నారు.

వెబ్దునియా పై చదవండి