వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మృతి చెందారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణ కోసం తన ప్రాణాలు త్యాగం చేశాడంటూ, నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ తమిళ మీడియాతో చెప్పిన వ్యాఖ్యలు ఈ వార్తలు మరింత ఊపునిచ్చాయి. అయితే, వార్తలపై కైలాస దేశం నుంచి అధికారక ప్రకటన విడుదలైంది.
తన మృతిపై వస్తున్న వదంతులను ఖండించిన నిత్యానంద, తాను పూర్తి సురక్షితంగా ఉన్నానని, జీవ సమాధిలో ఉన్నానని ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆయన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యానంద ప్రస్తుతం తన సొంత దీపం కైలాసలో ఉంటూ, తన ధార్మిక కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టు సమాచారం.