భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా... 1100 కి.మీ పాదయాత్ర..!

బుధవారం, 4 మార్చి 2015 (19:19 IST)
కేంద్రం ప్రతిపాదించిన భూసేకరణ చట్ట సవరణ బిల్లులోని రైతుల వ్యతిరేక నిబంధనలపై సామాజిక ఉద్యమకర్త అన్నాహజారే సమరశంఖం పూరించారు. కేంద్రం ప్రతిపాదించిన భూసేకరణ చట్ట సవరణ బిల్లులోని రైతు వ్యతిరేక నిబంధనలను ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మహారాష్ట్రలోని వార్దా నుండి ఢిల్లీకి 1100 కి.మీ. వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. 
 
దీనివలన దారిలోని అన్ని గ్రామాలను పట్టణాలను కలుపుకుంటే భూసేకరణ చట్టంపై ఒక అవగాహన వస్తుందనేది వారి భావన. వార్ధాలోని గాంధీ ఆశ్రమం నుంచి మొదలయ్యే యాత్ర ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ముగుస్తుందన్నారు. 
 
ఈ యాత్రకు సుమారు 3 నెలల సమయం పడుతుందన్నారు. ఈ నెల 9న సేవాగ్రామ్‌లో జరిగే సమావేశంలో పాదయాత్ర షెడ్యూల్‌ను నిర్ణయిస్తామని చెప్పారు. మూడు నెలల పాదయాత్రతో దేశంలో ఇదే ప్రధాన చర్చనీయాంశం కానున్నది. 

వెబ్దునియా పై చదవండి