ముంబై పేలుళ్ల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను గృహ నిర్భంధం నుంచి విడుదలయ్యాడు. ముంబైలో దాడులకు పాల్పడి 166 మంది ప్రాణాలను బలిగొన్న హఫీజ్‌ను గృహనిర్భంధం నుంచి తప్పించాలని లాహోర్ హైకోర్టులోని రివ్యూ బోర్డు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ సర్కారు హఫీజ్ సయ్యిద్ దోషి అనేందుకు తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో హఫీజ్‌ను విడుదల చేయాలని రివ్యూ బోర్డు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో హఫీజ్ విడుదలపై పాకిస్థాన్ తీరును అమెరికా తప్పుబట్టింది. భారత్‌పై యుద్ధం ప్రకటించిన హఫీజ్‌ను తిరిగి అరెస్టు చేయాలని.. అతనిపై కేసు నమోదు చేయాలని పాకిస్థాన్‌కు అమెరికా సూచించింది. కాగా హఫీజ్ సయీద్ గృహనిర్బంధం నుంచి విడుదలైన కొన్ని గంటల్లోనే భారత్‌పై యుద్ధానికి సై అన్నాడు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశాడు.