కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పునరుత్తేజం కల్పించే దిశగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆమె పార్టీ శ్రేణులను, నేతలను సమాయాత్రం చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉదయ్‌పూర్ వేదికగా చింతన్ శిబిర్‌ను నిర్వహించతలపెట్టింది. ఈ చింతన్ శిబిర్ సన్నాహాలపై సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది.
ఇందులో సోనియా గాంధీ కీలక ప్రసంగం చేశారు. పార్టీ పునరుజ్జీవానికి సంబంధించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికీ మేలు చేసిందనీ, ఆ రుణాన్ని తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ దిశగా పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగితే ఫలితాలు వాతంటత అవే వస్తాయని ఆమె చెప్పారు.