మూడేళ్ళ బాలికపై అత్యాచారం... బెంగుళూరులో కామాంధుడు...

బుధవారం, 22 అక్టోబరు 2014 (15:28 IST)
బెంగుళూరులోని ఒక స్కూల్లో చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటన ఇంకా ప్రజల హృదయాలను కలచివేస్తూ ఉండగానే ఇంతలోనే బెంగుళూరులోనే మరో చిన్నారి మీద అత్యాచారం జరిగింది. ఇది జరిగింది స్కూల్లోనే. బెంగుళూరు నగరంలోని జలహళ్ళి ప్రాంతంలో వున్న ఒక స్కూల్లో మూడేళ్ళ వయసు గల చిన్నారిపై అత్యాచారం జరిగింది. తనపై జరిగిన అత్యాచారం విషయాన్ని ఆ పాప తన తల్లికి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. కాగా దీనిపై పోలీసు కమిషనర్ విచారణ చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి