బరాక్ ఒబామా మారిన షెడ్యూల్ ఇదే..

శనివారం, 24 జనవరి 2015 (18:27 IST)
అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా భారత గణతంత్ర దినోత్సవాలలో పాల్గొనడానికి ఆదివారం నాడు భారతదేశానికి వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒబామా భారతదేశ పర్యటన షెడ్యూలు గతంలో ఖరారు చేసినట్టుగా కాకుండా కొద్దిగా మారింది. 
 
25వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఒబామా న్యూఢిల్లీకి చేరుకుంటారు. రాష్ట్రపతి భవన్‌లో లాంఛన స్వాగతం అనంతరం ఒబామా దంపతులు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి మహాత్మాగాంధీ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం ప్రధాని మోడీతో హైదరాబాద్ హౌస్‌లో సమావేశమవుతారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్ ముఖర్జీతో భేటీ అవుతారు.
 
26న రాజ్‌ పథ్‌లో జరిగే గణతంత్రవేడుకల్లో ఆయన పాలుపంచుకుంటారు. 27వ తేదీ ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో జరిగే టౌన్ హాల్‌లో పారిశ్రామికవేత్తల రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తారు. 27న ఆగ్రాలో తాజ్ సందర్శనను రద్దు చేసుకుని సౌదీ వెళ్లనున్నారు. సౌదీ రాజు అబ్దుల్లా స్థానంలో కొత్త రాజుగా నియమితులైన ఆయన సోదరుడు సల్మాన్‌ను ఆయన కలవనున్నారు. 

వెబ్దునియా పై చదవండి