ఇంకా బాధితురాలి తల్లి సైతం వారికే మద్దతు తెలిపింది. ఫిర్యాదు చేస్తానని పోలీస్ స్టేషన్కు వెళ్లగా.. వారు సైతం అత్యాచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. ఈ అఘాయిత్యాలను భరించలేకపోయిన బాధితురాలు.. సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనపై రోజుకు 20-25 మంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇంట్లోనే బాధితురాలి తల్లి మద్యం విక్రయిస్తోంది. మద్యం తాగే వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడేవారని.. తిరస్కరిస్తే కొట్టేవారని ఆ వీడియోలో తెలిపింది. ఈ విషయం మా నాన్న, మామకు చెబితే వారు సైతం అదే చేసేవారు. గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్, ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వెళితే పోలీసులు అత్యాచారం చేశారు. మద్యం తాగి రోజుకు 20-25 మంది అత్యాచారానికి పాల్పడేవారు. నన్ను రక్షించండి లేకుంటే వారు చంపేస్తారు అంటూ బాధితురాలు చెప్పింది.
ఈ ఘటనకు సంబంధించి వీడియో బయటకు రావడం వల్ల అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి స్టేట్మెంట్ తీసుకుని.. వైద్య పరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రులు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ ఏఎస్సై మనోజ్ కుమార్ పైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ హృదయ్కాంత్ విచారణకు ఆదేశించారు.