దేశ రాజధాని నగరం ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ బీజేపీని ఊడ్చిపారేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం రోజున బిర్యానీ సేల్ అదిరిపోయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో చీపురు పార్టీ గెలిచింది. కాంగ్రెస్, బీజేపీలు ఖంగుతిన్నాయి.
అయితే ఈ ప్రచారాన్ని అరవింద్ కేజ్రీవాల్ పెద్దగా పట్టించుకోలేదు. సీఏఏ ఆందోళనకారులను ఆయన పరామర్శించనూ లేదు. ఈ ఆరోపణలను ఏమాత్రం చెవిలో వేసుకోలేదు. ఈ ఆరోపణలను తిప్పికొట్టేలా మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును నమోదు చేసుకున్నారు. దీంతో ఢిల్లీలో బిర్యానీ అమ్మకం ఊపందుకుంది. బీజేపీ ఓటమి చెందడానికి హర్షిస్తూ.. చాలామంది బిర్యానీ తిని మరీ పండగ చేసుకున్నారు.
మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు భారీగా బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని హోటల్ నిర్వాహకులు తెలిపారు. ఇంకా కొన్ని హోటల్స్ బిర్యానీపై ఆఫర్లు ప్రకటించాయి. దీంతో జెట్ వేగంలో బిర్యానీ అమ్మకం పరుగులు పెట్టింది. మంగళవారం అయినప్పటికీ బిర్యానీ అమ్మకాలు తగ్గలేదని.. బీజేపీ ఓటమిని ప్రజలు అలా పండగ చేసుకున్నారట.