ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ : 5 రాష్ట్రాల ఎన్నికలపైనే చర్చ

ఆదివారం, 7 నవంబరు 2021 (13:03 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ఈ భేటీలో ప్రధానంగా వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై చర్చలు జరగుతున్నట్లు సమాచారం. అలాగే ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. దీనిపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. 
 
న్యూఢిల్లీలోని ఎన్‌డిఎంసి కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కీలక సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ సహా బీజేపీ  అగ్రనేతలు హాజరవుతున్నారు
 
వచ్చే ఏడాది ప్రారంభంలో యూపీ, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌లలో నెక్స్ట్‌ ఇయర్‌ లాస్ట్‌లో ఎలక్షన్స్‌ నిర్వహిస్తారు. ఐతే పంజాబ్‌ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
 
కాగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి వర్చువల్ ద్వారా కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్, వివేక్, ఈటల, రాజాసింగ్, విజయశాంతి, జితేందర్ రెడ్డి, గరికపాటి పాల్గొంటున్నారు. డీకే అరుణ, లక్ష్మణ్, మురళీధరరావులు ఢిల్లీలో నేరుగా జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగంతో ఈ భేటీ ముగియనుంది

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు