తమిళనాడు లోని సేలం జిల్లాలో కాడయంపట్టి గ్రామంలో పదిరోజుల క్రితం పుట్టిన లేగదూడ పాలిస్తూ జనాలను ఆబ్బురపరుస్తుంది. వేలు అనే రైతుకు చెందిన ఓ ఆవు దూడను ఈనింది. ఆ లేగదూడ నేలపై కాలు మోపినప్పటి నుంచి దాని పొదుగు నుంచి పాల చుక్కలు రాలాయి. ఆ దృశ్యాన్ని చూసిన రైతు వేలు దాని పొదుగును పితికి చూడగా పాలు కారింది.