జేకీ సీఎం ముఫ్తీ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు : రాజ్‌నాథ్

సోమవారం, 2 మార్చి 2015 (12:47 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాతంగా జరగడానికి పాకిస్థాన్ ఉగ్రవాదులేనంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మొహ్మద్ సయ్యద్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 
 
జేకీ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగేందుకు పాకిస్థాన్, హురియత్‌లు సహకరించాయని ముఫ్తీ సయీద్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో రగడ సృష్టించాయి. ముఫ్తీ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని కాంగ్రెస్ తదితర విపక్ష పార్టీలు పట్టుబట్టడంతో, ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగింది. 
 
దీంతో కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కల్పించుకుని మాట్లాడుతూ, ముఫ్తీ మాటలు ఆయన వ్యక్తిగతమని, ప్రజల వల్లనే ఎన్నికలు విజయవంతమయ్యాయని సభకు సమాధానమిచ్చారు.ఈ విషయంలో ప్రధాని స్పందించాల్సిన అవసరం లేదని, తాను ఆయనతో మాట్లాడి వివరణ ఇస్తున్నట్టు రాజ్‌నాథ్ చెప్పారు. దీనిపై సంతృప్తి చెందని విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. 

వెబ్దునియా పై చదవండి