టమోటా ధరలకు రెక్కలు.. రూ.100 నుంచి రూ.120 వరకు..?

శనివారం, 1 జులై 2023 (10:06 IST)
నైరుతి రుతుపవనాలు ఒకే సమయంలో అనేక రాష్ట్రాల్లో ప్రారంభమై భారీ వర్షాలు కురిపించాయి. దీంతో టమోటా సాగుపై ప్రభావం పడింది. 
 
దీంతో గత వారం టమాటా ధర అమాంతంగా పెరిగింది. కిలో టమాటా రూ.100కు పైగా అమ్ముడుపోయింది. గత రెండు రోజులుగా ధర క్రమంగా తగ్గుముఖం పట్టింది.
 
ప్రస్తుతం దేశంలోని ప్రధాన మార్కెట్లలో టమోటా ధరలు కిలో ధర వంద రూపాయలు పలుకుతోంది.  రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. అలాగే ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు