చెన్నైలో కుక్కపై అత్యాచారం చేసిన యువకుడు...

బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (16:09 IST)
ఎవరైనా తప్పు చేస్తే 'వీడు చిత్తకార్తె కుక్కరా బాబూ' అని మన పెద్దోళ్లు అంటుంటారు. ఇపుడు నిజంగానే ఓ యువకుడు చిత్తకార్తె కుక్కలానే ప్రవర్తించాడు. చెన్నైకు చెందిన ఓ యువకుడు కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక నందనం ప్రాంతంలోని ఓ టీస్టాల్‌లో పనిచేసే యువకుడు ఒకరు పీకల వరకు మద్యం సేవించి వీధిలోని కుక్కపై అత్యాచారం చేశాడు. ఈ ఘటను గమనించిన స్థానికులు అతడిని తిట్టి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు.
 
అయితే, ఆ నిందితుడు మాత్రం తాగిన మద్యంలో వారిని లెక్కచేయలేదు. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు... ఆ కామాంధుడుని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 
 
అత్యాచారానికి గురైన కుక్కతో తిరుగుతున్న నిందితుడి వీడియోను స్థానికులు పోలీసులు ఆధారాలుగా సమర్పించారు. అయితే, నిందితుడు కుక్కపై అత్యాచారం చేస్తున్నట్లు ఎక్కడా కూడా కనిపించలేదు. దీంతో పోలీసులు కుక్కను వైద్య పరీక్షలకు తరలించి, నిందితుడిని విచారిస్తున్నారు. 
 
నిందితుడు నిత్యం వీధి కుక్కలతో కలిసి ఉండటాడని, ముఖ్యంగా అర్థరాత్రిళ్లు వాటితో గడుపుతుంటాడని స్థానికులు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు పోలీసులు నిందితుడిపై సెక్షన్ 377, 429 కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు