వాడేం చేస్తాడులే అని అనుకోవడమే ఆమె చేసిన తప్పు. ఆమె అతడి వార్నింగులను లైట్ గా తీసుకోవడం వల్ల ప్రాణాలను కబళించాడు ఆ దుండగుడు. చెన్నై నుంగబాక్కం రైల్వే స్టేషనులో పట్టపగలు అందరూ చూస్తుండగా నల్ల ప్యాంటు ధరించిన ఓ దుండగుడు చెన్నై ఇన్పోసిస్ లో పనిచేస్తున్న స్వాతి అనే 24 ఏళ్ల యువతిని పీక కోసి అత్యంత కిరాతకంగా హతమార్చాడు.
క్రిక్కిరిసిన రైల్వే స్టేషనులో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేస్తున్నా అంతా అలా చూస్తూ ఉండిపోయారు. తేరుకునేసరికి దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా ఇదే వ్యక్తి స్వాతితో గత వారం తీవ్రంగా వాదనకు దిగడాన్ని తను చూసినట్లు ఓ క్యాబ్ డ్రైవర్ వెల్లడించాడు. అతడు చెప్పినదాన్ని బట్టి అతడు స్వాతికి తెలిసినవాడై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాతి బంధువులను, ఇతర స్నేహితులను విచారిస్తున్నారు.
కాగా తమ ఉద్యోగి దారుణ హత్యపై ఇన్ఫోసిస్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తామనీ, దుండగుడిని కఠినంగా శిక్షించాలని తెలిపింది.