చంద్రబాబు చేయి తాకిన చిదంబరానికి జైలు కష్టాలు... ఎవరు?

గురువారం, 22 ఆగస్టు 2019 (14:12 IST)
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అవకాశం దొరికితే మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేసేస్తున్నారనే టాక్ వుండనే వుంది. ఇపుడు మళ్లీ విజయసాయి... దూకుడు చిత్రంలో మహేష్ బాబు.. మళ్లీ ఏసేశారు అన్నట్లు ట్విట్టర్లో ఓ సెటైర్ విసిరారు. ఇంతకీ ఆయన ఏమని పేర్కొన్నారో చూడండి.
 
'బాబు గారు ఎవరింట్లో పాదం మోపినా, కరచాలనం చేసినా ఆ వ్యక్తులు రాజకీయంగా పతనం అవడం యాధృచ్ఛికమేమీ కాదు. పాద మహిమ అలాంటిది. ఇప్పుడు చిదంబరం గారికి పీకల్లోతు కష్టాలొచ్చాయి. ఎన్సీపీ ఎమ్మెల్యులు పార్టీ మారుతుంటే శరద్ పవార్ గారు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు మీడియాలో వచ్చాయి' అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
అంతటితో ఆగకుండా మరో ట్వీట్ వేశారు. అదేంటంటే... 'ఛీ..ఇంత నీచానికి తెగబడాల్సిన అవసరముందా చంద్రబాబు గారూ. జూనియర్ ఆర్టిస్టులను వరద బాధితులుగా యాక్షన్ చేయించి ప్రభుత్వాన్ని తిట్టిస్తారా? యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఇరిగేషన్ మంత్రి అయితే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కులం, వృత్తిని ధూషించి యావజ్జాతిని అవమానిస్తారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు