సాంకేతిక తప్పిదం వల్లే కిరణ్ కు రెండు ఓటరు కార్డులు.. ఆమె తప్పిదం లేదు.

గురువారం, 29 జనవరి 2015 (20:32 IST)
కిరణ్ బేడికి  రెండు ఓటరు కార్డుల జారీ విషయంలో ఆమె తప్పిమేమి లేదనీ, అందు సాంకేతిక లోపాలు సిబ్బంది ఈసీ సిబ్బంది పొరబాట్ల వలన మాత్రమే అలా జరిగిందని ఈసి వివరణ ఇచ్చింది. ఇందులో బీజేపీ అభ్యర్థి చట్ట ప్రకారమే వ్యవహరించారని ఈసి అభిప్రాయపడింది. 
 
ఓటు బదిలీ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారని, అయితే తమ సిబ్బంది పొరబాటు కారణంగా రెండు ఓటర్ గుర్తింపు కార్డులున్నట్టు వచ్చిందని ఈసీ తెలిపింది. అసలు సమాచారాన్ని తమ వెబ్ సైట్‌లో అప్ డేట్ చేయలేదని చెప్పింది. కాగా, బేడీకి రెండు ఓటర్ గుర్తింపు కార్డులు జారీ చేసినట్టు ఎన్నికల సంఘం రికార్డు ద్వారా ఈ ఉదయం తెలిసింది. 
 
అంతకుముందు వేర్వేరు చిరునామాలతో ఆమె రెండు ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయంటూ విపక్ష సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. వెంటనే రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం ఈ అంశాన్ని తేల్చేసింది. ఎన్నికల సంఘం రికార్డు ప్రకారం... రాజధానిలోని ఉదయ్ పార్క్, తల్కతోరా లేన్ చిరునామాలతో ఓటర్ గుర్తింపు కార్డులు ఇచ్చారట. ఇదే విషయంపై బేడీని మీడియా అడిగితే ఖండించారు. 
 

వెబ్దునియా పై చదవండి