అంతా ప్రధానమంత్రే చూసుకున్నారు.. నాకే పాపం తెలియదు: దాసరి

మంగళవారం, 30 జూన్ 2015 (13:51 IST)
బొగ్గు స్కామ్ కేసులో కేంద్ర మంత్రి, ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు మంగళవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. బొగ్గు స్కామ్‌లో దాసరి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో సీబీఐ కోర్టుకు హాజరైన దాసరి అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను కేవలం బొగ్గు శాఖా సహాయమంత్రిగానే పనిచేశానని, శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చూసుకున్నారని.. తనకే పాపం తెలియదని దాసరి వ్యాఖ్యానించారు. 
 
కోల్ బ్లాక్స్ కేటాయింపుల దగ్గర్నుంచి అన్ని నిర్ణయాలు మన్మోహన్ సింగ్‌వేనని చెప్పారు. కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని దాసరి స్పష్టం చేశారు. కోల్ స్కామ్ కేసు కోర్టులో ఉన్నందున దీనిపై మాట్లాడబోనని.. సహాయమంత్రిగా పనిచేసిన మాట నిజమేనని.. అయితే ఎలాంటి తప్పు చేయలేదని.. అన్నీ పవర్లు అప్పటి పీఎమ్ మన్మోహన్ సింగ్ చేతిలో ఉన్నదని దాసరి వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి