మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆపార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ప్రతిపాదన 1996 నుంచి పెండింగ్లో ఉన్న నేపథ్యంలో... రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు కొన్ని కారణాల వల్ల లోక్సభలో ఆమోదం పొందలేకపోయిందని సోనియా బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు.