సాధారణంగా తమ పార్టీ సీనియర్లపై విమర్శలు చేస్తే తమ రాజకీయ భవిష్యత్ ఏమైపోతుందోనని చాలా మంది కాంగ్రెస్ నేతలు భయపడుతుంటారు. అందుకే ప్రాంతీయ పార్టీల నేతలు సీనియర్లను విమర్శించాలంటే ఒకటికి పది సార్లు ఆలోచన చేస్తారు. కానీ, ముస్తఫా మాత్రం ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడైన రాహుల్‌పైనే విమర్శలు గుప్పించారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఓ పెద్ద జోకర్ అని అన్నారు. పార్టీ నుంచి బయటకు విసిరేసిన నేత రాహుల్ గాంధీ అని ఆయన దుయ్యబట్టారు. ప్రధాని మోడీని ముస్తఫా కొనియాడారు. కాశ్మీర్ వరదలను ఎదుర్కోవడంలో, ఇరాక్‌లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకురావడంలో మోడీ చూపిన ఆత్మస్థైర్యం తిరుగులేనిదని ఆయన కొనియాడారు.