జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా.. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉత్తర జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా శనివారం విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, పెనుగాలులు వీస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది.
ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో వడగండ్ల వాన కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఒంటిమిట్ట శ్రీరామాలయంలో రాములోరి కల్యాణోత్సవం సందర్భంగా భారీగా కురిసిన వడగండ్ల వానలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.