జయలలితకు బెయిల్ నో: విచారణ 7వ తేదీకి వాయిదా!

బుధవారం, 1 అక్టోబరు 2014 (11:40 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్‌పై బుధవారం విచారణకు చేపట్టిన కర్ణాటక హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. జయలలిత బెయిల్ పిటిషన్‌ను రెగ్యులర్ బెంచ్ విచారణ జరుపుతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో జయలలిత మరికొన్ని రోజులు జైళ్లోనే గడపనుంది.
 
జయలలిత తరుపున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ ఈ వ్యవహారంలో వాదనలు వినిపించారు. రాం జెఠ్మలానీ వాదనలు వినిపిస్తున్న సమయంలో కోర్టు బయట అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలిత సెప్టెంబర్ 27 నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి