నేడు నేతాజీ జయంతి - జాతీయ సెలవు దినంగా ప్రకటించాలనీ...

ఆదివారం, 23 జనవరి 2022 (09:56 IST)
స్వాతంత్ర్య సమరయోధుడు నేజాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఆదివారం దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. 
 
ఇదిలావుంటే, నేతాజీ జయంతి రోజైన జనవరి 23వ తేదీన జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని వెల్లడిచారు తద్వారా దేశం మొత్తం నివాళులు అర్పిస్తుందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, దేశ్ నాయక్ జయంతి వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలని కోరారు. 
 
మరోవైపు, ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహాన్ని నెలకొల్పమన్నారు. నేతాజీ విగ్రహం ఇత్రాన్ని ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని ప్రధాని ప్రకటించిన విషయం తెల్సిందే. నేతాజీ విగ్రహం సిద్ధమయ్యే వరకు ఆయన హోలోగ్రామ్ విగ్రహం అదే స్థలంలో ఉంటుందని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు