డాక్యుమెంటరీలు, యాడ్ ఫిల్మ్స్‌లో అవకాశాలున్నాయని, తనకు సహకరిస్తే బాలీవుడ్ సినిమాలోనూ అవకాశం కల్పిస్తానని ఓ యాడ్ ఫిల్మ్ డైరక్టర్ ఓ టీనేజ్ అమ్మాయిని వేధించాడు. బాలిక అంగీకరించకపోవడంతో బలవంతం చేశాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. వేధించాడు. యూనిట్ నుంచి తీసేస్తానని బెదిరించాడు. అయితే ధైర్యం చేసుకుని తనను వేధించిన వ్యక్తిపై ఆ మైనర్ బాలిక ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీలో రవీందర్ (47) అనే వ్యక్తిపై ఓ టీనేజీ నటి కేసు పెట్టింది. రవీందర్ లజపత్ నగర్ సమీపంలో నటనలో శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇతని వద్ద ఓ మైనర్ బాలిక శిక్షణ పొందుతోంది. గత నెలలో షూటింగ్ నిమిత్తం వీరి టీమ్ ఫతేపూర్ బెరీ ప్రాంతానికి వెళ్లగా, ఆ బాలికను వేధించడం మొదలెట్టాడు. తనకు సహకరించాలన్నాడు.