ఆ తర్వాత సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లు, మృతుడి కాల్ రికార్డులను పరిశీలించారు. ఈ పరిశీలనలో అతని ప్రియురాలే హత్య చేయించిందని గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె వద్ద విచారణ జరుపగా అసలు విషయం తెలిసింది.
తనకు రెండున్నరేళ్ల నుంచి రాజారాం పరిచయమని, ఆపై కిరణ్ అనే మరో యువకుడు పరిచయం అయ్యాడని తెలిపింది. ఆ తర్వాత రాజారాంను దూరపెడుతూ వచ్చాననీ, కానీ, రాజారాం మాత్రం తనను వదిలిపెట్టకుండా వేధిస్తూ వచ్చాడని చెప్పింది.
దీంతో తన కొత్త ప్రియుడు కిరణ్‌తో కలిసి రాజారాంను కడతేర్చినట్టు చెప్పింది. రాజారాంను ఓ పార్కు వద్దకు రమ్మని పథకం ప్రకారం హత్య చేయించింది. ఈ కేసులో ప్రేయసీ ప్రియులను అరెస్ట్ చేశామని, తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.