ఢిల్లీలో కరోనా ఆంక్షల సడలింపు... నేటి నుంచి స్కూల్స్

సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (08:59 IST)
దేశ రాజధాని ఢిల్లీపై కరోనా వైరస్ విరుచుకుపడింది. తొలి, మూడో దశల్లో ఈ ప్రభావం అధికంగా కనిపించింది. అయితే, తొలి దశలో అధిక ప్రాణనష్టం ఏర్పడింది. వైద్య సౌకర్యాల కొరత తీవ్రంగా వేధించింది. కానీ, మూడో దశలో కరోనా మరణాలు చాలా తక్కువ. అదేసమయంలో ఎక్కడా కూడా వైద్య సదుపాయాల కొరత తలెత్తలేదు. 
 
ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు చేపట్టిన వివిధ రకాలైన చర్యల ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దీంతో ఢిల్లీలో కరోనా ఆంక్షలను సడలించారు. ఫలితంగా సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.
 
సోమవారం నుంచి ఢిల్లీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకోనున్నాయి. తొలి దశలో 9 నుంచి 12వ తరగతుల వరకు ఆన్‍‌లైన్, ఆఫ్‌లైన్‌లో తరగతులు ప్రారంభిస్తారు. ఈ నెల 14వ తేదీ నుంచి నర్సరీ నుంచి 8వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమవుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు