ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచి ఎడప్పాడి పళనిసామిని తప్పించి తమిళనాడు సీఎం కావాలని దినకరన్ ప్లాన్ వేశారని సమాచారం. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన తరువాత తనను సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని దినకరన్ ధీమాగా ఉన్నారని తెలిసింది. ఆర్‌కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ విచ్చలవిడిగా డబ్బు పంచిపెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం తరఫునుంచి దినకరన్ పోటీకి దిగిన విషయం తెలిసిందే. అయితే, ఆయన పెద్ద మోసగాడని జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, పార్టీతో పాటు ప్రభుత్వాన్ని నడిపించే అధికారం శశికళ వర్గానికి లేదని ఆయన అన్నారు.
జయలలితకు నిజమైన రాజకీయ వారసులు పన్నీర్ సెల్వం, మధుసూదనన్ మాత్రమేనని తెలిపారు. జయలలిత ఫొటోతో ఎన్నికల్లో ప్రచారం చేసుకునే అర్హత దినకరన్‌కు లేదని, అధికార పీఠం ఎక్కాలనుకుంటున్న దినకరన్ ఆశలు నెరవేరబోవని అన్నారు.