ఢిల్లీలో గన్ కల్చర్: వృద్ధ వైద్యుడిని కాల్చి హతమార్చిన ఆగంతకుడు!

శనివారం, 14 మే 2016 (15:03 IST)
మనదేశంలోనూ గన్ కల్చర్ మొదలైంది. విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో గన్ కల్చర్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో.. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 61 ఏళ్ల డాక్టర్‌ను ఓ ఆగంతుకుడు గన్‌తో షూట్ చేసి హతమార్చాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఢిల్లీలో ఆ డాక్టర్ క్లినిక్‌లోనే జరగడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని రమావత్ క్లినిక్‌లో డాక్టర్ బల్వాన్ సింగ్ వైద్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 
 
శుక్రవారం రాత్రి పది గంటల ప్రాంతంలో క్లినిక్ నుంచి  గన్ సౌండ్ వినిపించడంతో స్థానికులు హాస్పిటల్‌ వద్దకు చేరారు. ఇంకా వృద్ధ డాక్టర్‌ను ఎవరో షూట్ చేసినట్లు గమనించారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ బల్వాన్ సింగ్‌ను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కానీ చికిత్స ఫలించక బల్వాన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
రమావత్‌కు వ్యక్తిగతంగా శత్రువులుండబట్టే ఆయన హతమైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసుపై డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించిన విచారణ కోసం రెండు బృందాలను నియమించినట్లు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి