ఔషధం రుచి చూసి కోమాలోకి వెళ్లిన ఆయుర్వేద వైద్యుడి మృతి

మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (08:24 IST)
ఔషధం రుచి చూసి కోమాలోకి వెళ్లి తొమ్మిదేళ్ళుగా జీవచ్ఛవంలా ఉన్న ఆయుర్వేద వైద్యుడు సోమవారం కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కొచ్చి సమీపంలో ఉన్న పైప్రా గ్రామానికి చెందిన డాక్టర్‌ పి.ఏ.బైజూ.. ప్రభుత్వ ఆయుర్వే వైద్య డిస్పెన్సరీలో వైద్య అధికారి. ఆయన 2007 జనవరిలో ఒక మహిళకు కీళ్ల నొప్పుల ఔషధాన్ని ఇచ్చారు. దానిని వేసుకున్న ఆమె స్పృహతప్పి పడిపోయి కొద్దిసేపటికే కోలుకుంది. 
 
ఈ విషయాన్ని రోగి తరపు బంధువులు బైజూకు చెప్పారు. అయితే, ఆ ఔషధం వల్ల ప్రమాదమేమీ ఉండదని, దానిని ఆయన తిన్నారు. కానీ, దానిని తిన్న వెంటనే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. తొమ్మిదేళ్లుగా కోమాలో ఉన్న ఆయన మరణించారు. కాగా, రోగి భర్త ఆ ఔషధంలో పురుగుల మందు కలిపి బైజూకు ఇచ్చాడనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. 

వెబ్దునియా పై చదవండి