1970లో మృతి చెందిన ఓ శిశువు మూలకణాలను ఆక్స్‌ఫర్డ్ తన వ్యాక్సిన్లో వినియోగించిందని పేర్కొంటూ ఆస్ట్రేలియాకు చెందిన సుఫీయా ఖలీఫా అనే ఇమామ్ ఓ వీడియోలో పేర్కొన్నారు. ముస్లిం మత ఆచారం ప్రకారం ఇది హరామ్ అని, కాబట్టి టీకాను తీసుకోవద్దని పిలుపునిచ్చారు.
అంతకు ముందే.. క్రైస్తవుల మత పెద్ద ఆర్చ్‌బిషప్ ఆంథోనీ ఫిషర్ కూడా టీకాను వ్యతిరేకించారు. టీకా అభివృద్ధిలో శిశువు మృతకణాలు వినియోగించారని, ఇది క్రైస్తవులకు నైతికపరమైన సమస్యను సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు.