తమను అణచివేసే లక్ష్యంతో భద్రత బలగాలు తొలిసారిగా డ్రోన్‌తో బాంబులు వేశాయని మావోయిస్టులు ఆరోపించగా.. దీన్ని పోలీసులు ఖండించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఓ ఘటనపై మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప పేరిట మీడియాకు బుధవారం ఓ లేఖ విడుదల చేశారు.
బొత్తలంక, పాలగూడెం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో ఈ నెల 19 తెల్లవారుజామున పోలీసులు డ్రోన్‌తో 12 బాంబులను అడవిలో వదిలారని లేఖలో ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. డ్రోన్ సహాయంతో బాంబుల దాడి ఆరోపణల్లో నిజం లేదని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ ఖండించారు.