లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

మంగళవారం, 31 అక్టోబరు 2023 (09:57 IST)
ఢిల్లీలో వెలుగు చూసి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల‌్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో విచారణకు తమ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఇందులోభాగంగా, నవంబరు రెండో తేదీన ఈడీ కార్యాలయానికి రావాలని తేలింది. 
 
కాగా, ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంమత్రి మనీశ్ సిసోడియాను గత ఏప్రిల్ నెలలో అరెస్టు చేసిన విషయం తెల్సిందే. గత ఆరు నెలలుగా ఆయన జైలులో ఉన్నారు. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు సైతం బెయిల్ మంజూరు చేయడం లేదు. పైగా, ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొన్ని గంటల్లోనే అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. 
 
గతేడాది ఏప్రిల్లో ఇదే విషయంపై సీబీఐ కూడా కేజీవాల్‌కి నోటీసులు ఇచ్చింది. అయితే గతేడాదే దాఖలు చేసిన ఛార్జిషీట్లో కేజీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదు. కేజీవాలు నోటీసులు జారీ చేయడంపై ఆప్ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ఏది ఏమైనా ఆప్ పార్టీని నాశనం చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందుకోసం ఒక అక్రమ కేసు సృష్టించడం సహా సాధ్యమైనవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. అరవింద్ కేజీవాల్‌ను జైలుకు పంపి ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉందని దుయ్యబట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు