మధ్యప్రదేశ్‌ రైలు ప్రమాదాలపై విచారణకు ఆదేశం.. నది ఉధృతితో సహాయక చర్యలకు అంతరాయం

బుధవారం, 5 ఆగస్టు 2015 (07:47 IST)
మంగళవారం అర్థరాత్రి, బుధవారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలపై రైల్వేశాఖ విచారణకు ఆదేశించింది. ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు  వైద్య, సహాయక బృందాలతో సంఘటన స్థలానికి ప్రత్యేకరైలును పంపించారు. 
 
సహాయక చర్యలు చేపట్టేందుకు ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రంగంలో దించారు. మాచక్‌ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. రైల్వేశాఖ ప్రమాదాలపై పలు నగరాల్లో హెల్ప్‌లైన్‌ నెంబర్లను విడుదల చేసింది. 
 
రైల్వేహెల్ప్‌లైన్‌ నెంబర్లు 
హర్దా- 0975246088, 
భోపాల్‌-0755-40001609, 
బినా-07580 222580, 
ఇటార్సీ-07572-241920, 
ముంబయి-0222 5280005.

వెబ్దునియా పై చదవండి