విదేశీ కుక్కల దిగుమతి కేంద్రం నిషేధం.. ఎందుకో తెలుసా?

గురువారం, 28 ఏప్రియల్ 2016 (13:50 IST)
కొందరు తమ హోదాని పెంచుకోవడం కోసం, తమ కోరికల కోసం విదేశాల నుండి కుక్కలను దిగుమతి చేసుకొంటుంటారు. అయితే ఇకపై విదేశాల నుండి కుక్కలను దిగుమతి చేసుకోవడం వీలుపడదట. విదేశీ కుక్కలపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. పెంచుకోవడం, సంతానోత్పత్తి, ఏదైనా ఇతర అవసరాలకు మన భారతీయులు విదేశీ కుక్కలను దిగుమతి చేసుకొనేవారు. 
 
అయితే ఇలా చేయడం వలన చాలా కుక్కలు మన దేశంలోని వాతావరణానికి ఇమడలేక చనిపోతున్నాయి. ఈ విషయంపై కొన్నేళ్లుగా జంతు ప్రేమికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం విదేశీ కుక్కలపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వెబ్దునియా పై చదవండి