కాగా, ఈయనకు ఏప్రిల్ 12న తొలిసారి కరోనా వైరస్ సోకింది. దీంతో చండీగఢ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి కోలుకుని అదే నెల 30న డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని గంటలకే గుండెపోటు రావడంతో సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు.
అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. కాగా, గత నెల 11న ఆయనకు మరోమారు కరోనా సోకినట్టు వైద్యులు తెలిపారు. 1960లలో రాజకీయాల్లో అడుగుపెట్టిన వీరభద్ర సింగ్ 9సార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్‌కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.