మద్యం మత్తులో రోడ్డున వెళ్తున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి ఆ యువతులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... పూటుగా పీకల్లోతు మద్యం సేవించి ఓ యువకుడు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కోపం కట్టలు తెంచుకున్న ఆ యువతి అతడిని గొడ్డును బాధినట్టు బాదింది. తప్పయింది వదిలేయండి అని కాళ్లా వేళ్లా పడి బతిమాలినా ఆమెలో ఆగ్రహం చల్లారలేదు.
తొలుత ఆ యువకుడి ఆగడాలని భరించలేని ఆ యువతి అతగాడి నుంచి తప్పించుకుని వెళ్ళేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. దాంతో ఆమె తన స్నేహితురాలికి ఫోను చేసి పిలిపించింది. ఆ తర్వాత వారిద్దరూ వెదురుకర్రలు చేతబుచ్చుకుని అతనిని కుళ్లబొడిచారు. ఈ ఉదంతాన్ని అటుగా వెళ్తున్న ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.