భారత్‌కు వ్యతిరేక కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఎనిమిది యూట్యూబ్ చానెళ్ళపై నిషేధం విధించింది. వీటిలో ఏడు చానెళ్లు భారత్‌కు చెందినవికాగా, మరొకటి పాకిస్థాన్‌కు చెందిన చానెల్ ఉంది. ఈ చానళ్లు నకిలీ, భారత్ వ్యతిరేక కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి చానెళ్ళపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది.
కాగా, ఈ 8 యూట్యూబ్ ఛానళ్లకు మొత్తం 86 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. సుమారు 114 కోట్ల మంది ఆ వీడియోలను చూశారని, అయితే ఆ ఛానళ్లు విద్వేషాన్ని రెచ్చగొడుతోందని, మత వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించి కేంద్రానికి నివేదించింది.