జిల్లాకు చెందిన 15 యేళ్ళ బాలిక గతేడాది డిసెంబర్‌లో ఇంటి దగ్గర ఒంటరిగా నివశిస్తోంది. ఈమెపై ఆ బాలిక బాబాయ్ కుమారులిద్దరూ కన్నేశారు. ఆమెను ఎలాగైనా అనుభవించాలని పలు రకాల ఎత్తులు వేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇంటిపై ఆరేసిన బట్టలను తీసుకువచ్చేందుకు మిద్దెపైకి ఆబాలిక వెళ్లింది. ఇదే అదునుగా భావించిన ఆమె సోదరులిద్దరూ(బాబాయి కుమారులు) యువతిని బలవంతంగా టెర్రస్‌పై ఉండే గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు.
ఆ తర్వాత జరిగిన విషయం ఎవరికైనా చెప్పితే చంపేస్తామని బెదిరించారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు సోదరుల్లో ఒకరు మైనర్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఆ బాలికను పలుమార్లు లైంగికంగా అనుభవిస్తూ వచ్చారు. అయితే, ఆ బాలికకు ఇటీవల కడుపు నొప్పి రావడంతో ఆమెను చికిత్స నిమిత్తం తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది.
ఆస్పత్రిలో జరిపిన వైద్య పరీక్షల్లో బాధితురాలు ఏడు నెలల గర్భవతి అని తేలడంతో అసలు విషయం బయటపడింది. బాధితురాలు, ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల్లో ఒక యువకుడి(మైనర్)ని అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కి తరలించగా, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.