ఓటమి భారంతో హర్యానా సీఎం భూపిందర్‌ సింగ్‌ హుడా రాజీనామా!

సోమవారం, 20 అక్టోబరు 2014 (11:35 IST)
తాజా ఎన్నికల ఫలితాలతో ఖంగుతిన్న హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆదివారం ఆ రాష్ట్ర గవర్నర్‌కు చేరవేశారు. ఆదివారం వెల్లడైన ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెల్సిందే. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 
 
కాగా, మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానా రాష్ట్ర అసెంబ్లీకి 15వ తేదీ పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం కౌంటింగ్‌ జరుగగా కాంగ్రెస్ పార్టీ కేవలం 15 చోట్ల మాత్రే గెలుపొంది మూడో స్థానానికే పరిమితమైంది. భూపింద్రసింగ్‌పై అవినీతి ఆరోపణలు రావడం... గత పదేళ్ళుగా కొనసాగుతున్న కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు విసిగిపోయి బీజేపీకి పట్టం కట్టిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి