హెడ్ మాస్టర్ దారి తప్పాడు.. మహిళా టీచర్లు టాయిలెట్‌కు వెళితే.. గోడ సందుల్లో నుంచి?

బుధవారం, 31 ఆగస్టు 2016 (11:56 IST)
విద్యార్థులను సరైన దారిలో పెట్టాల్సిన ఓ హెడ్ మాస్టర్ దారి తప్పాడు. ప్రధానోపాధ్యాయుడి హోదాలో ఉండి మహిళా టీచర్లు టాయిలెట్‌కు వెళ్లగా గోడ సందుల్లో నుంచి ఫొటోలు తీస్తూ వచ్చాడు. చివరికి విషయం బయటకు పొక్కడంతో ఊచలు లెక్కపెడుతున్నాడు. సభ్యసమాజమే తలదించుకునే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఆ వివరాలను పరిశీలిస్తే.... కనౌజ్ సమీపంలోని సౌరిక్ అనే గ్రామంలో ప్రభుత్వ జూనియర్ హై స్కూల్ ఉంది.
 
ఆ స్కూల్లో విధులు నిర్వహించే ఇద్దరు మహిళా టీచర్లు టాయిలెట్‌కు వెళ్లారు. హఠాత్తుగా డోరు చప్పుడు కావడంతోపాటు ఎవరో వచ్చినట్లు అనిపించింది. ఎవరో ఫొటోలు తీస్తున్నట్టు అనిపించడంతో వెంటనే బయటికి వచ్చి చూశారు. పాఠశాలలో ఆడుకుంటున్న పిల్లలను ఈ విషయమై ప్రశ్నించగా, హెడ్మాస్టర్ తన ఫొన్‌లో ఫొటోలు తీశారంటూ అసలు విషయం చెప్పారు. దీంతో ఆ హెడ్మాస్టర్‌ను నిలదీయగా, తనపైనే నిందలు వేస్తారా అంటూ బిగ్గరగా అరుస్తూ... మీపై చర్యలు తీసుకుంటానంటూ బెదిరించాడు. జరిగిన విషయాన్ని ఆ టీచర్లు ఇంట్లో వాళ్లకు చెప్పడంతో వారు డిస్ట్రిక్ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. 
 
ఈ విషయమై విచారణ చేపట్టాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. టీచర్లపై ప్రధానోపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన విషయమై స్కూల్లోని పిల్లలు, ఇతర టీచర్లు, గ్రామ పెద్ద నుంచి సమాచారం సేకరించిన వారు ఆ నివేదికను మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. దీంతో ఆ హెడ్ మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి