దివ్యాంగుడిపై గ్రామ సర్పంచ్ కన్నెర్ర చేశాడు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్.. దివ్యాంగుడిపై జులుం ప్రదర్శించాడు. తనకు రావాల్సిన ఉపాధికూలీ డబ్బులను అడిగనందుకు రెచ్చిపోయిన సర్పంచ్.. అందరు వారిస్తున్న దివ్యాంగుడిని కాలితో తన్నాడు. దీంతో బాధితుడి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులే సర్పంచ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.