మనోజ్ శర్మ, సోనియాలు మూడేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. సోనియా తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ఈ పెళ్లి జరిగింది. అయితే తమ గ్రామం రావాల్సిందిగా పలుమార్లు అత్తమామలు పట్టుబట్టడంతో మనోజ్ ఎట్టకేలకు కుత్బా గ్రామానికి వెళ్లాడు. భాగ్‌పట్ జిల్లాలోని గాంగ్‌నౌలి గ్రామంలో ఉన్న తన సొంతింటి నుంచి అతను బయలుదేరినప్పడు బావమరుదులు వెంటే ఉన్నారు.
అయితే మనోజ్ శర్మ ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని బావమరుదులు, సోనియా కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసారు. మనోజ్ మృతదేహాన్ని చెరుకు తోటలో స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.